• waytochurch.com logo
Song # 4032

yaesu nee svaroopamunu naenu choochuchu nee poalikagaa naenu maaredhanయేసు నీ స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్



Reference: ప్రియులారా ... ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. 1 యోహాను John 3:2

పల్లవి: యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారెదన్ (2)

1. యేసు నా కొరకు నీవు, పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి, దీనుడైతివి
నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము

2. ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారానే, సమస్తము నిచ్చితివి
ఈ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము

3. ప్రభువా నీవందరి యెడల, శాంతము వహించితివి
ఎవరును నశింపక యుండవలెనని
నేను సహించలేను, సహనమునే కోల్పోయాను
నీ శాంతముతో నింపుము

4. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము
నీ సత్యము మేఘముల నంటుచున్నది
నే నయోగ్యదాసుడను, నిన్ను దుఃఖపెట్టి యున్నాను
నీ యధార్థతో నింపుము

5. యేసుని స్వరూపము కల్గి ఆయనవలె మారెదన్
ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము



Reference: priyulaaraa ... aayana prathyakShmainappudu aayana yunnatlugaanae aayananu choothumu ganuka aayananu poaliyuMdhumani yerugudhumu. 1 yoahaanu John 3:2

Chorus: yaesu nee svaroopamunu naenu choochuchu (2)
nee poalikagaa naenu maaredhan (2)

1. yaesu naa koraku neevu, paraloakamu vidachithivi
dhaasuni roopamu DhariMchi, dheenudaithivi
naenu dheenudanu kaanu, garvamuthoa niMdiyunnaanu
needhu vinayamuthoa niMpumu

2. praema gala oa prabhuvaa loakamunu praemiMchithivi
nee praema dhvaaraanae, samasthamu nichchithivi
ee praema choopalaenu kaTinudanaiyunnaanu
nee praemathoa niMpumu

3. prabhuvaa neevMdhari yedala, shaaMthamu vahiMchithivi
evarunu nashiMpaka yuMdavalenani
naenu sahiMchalaenu, sahanamunae koalpoayaanu
nee shaaMthamuthoa niMpumu

4. nammakamaina prabhuvaa, nee kaaryamu adhbhuthamu
nee sathyamu maeghamula nMtuchunnadhi
nae nayoagyadhaasudanu, ninnu dhuHkhapetti yunnaanu
nee yaDhaarThathoa niMpumu

5. yaesuni svaroopamu kalgi aayanavale maaredhan
ee roopaaMtharamu korakai nireekShiMchedhan
aa adhbhutha dhinamu koraku nannu sidhDhaparachumu
nee pavithrathathoa niMpumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com