• waytochurch.com logo
  • Song - 4037 : aathma niyamamu dhvaaraa saagi poavudhamu-ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము Lyrics - Zion Songs Telugu

  • Quick search

  • Reference: విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ... పరుగెత్తుదము హెబ్రీ Hebrews 12:12

    పల్లవి: ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
    విశ్వాసమునకు కర్తయు దానిని
    కొనసాగించు యేసుని జూచుచు
    ఓపికతో మనము సాగి పోవుదము

    1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
    ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము

    2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
    నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము

    3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
    పారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము

    4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
    భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము

    5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
    బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము

    6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
    పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము

    7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
    ప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 1342 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558205
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com