• waytochurch.com logo
Song # 4042

nae sthuthimchedhanu yaesu naamamunu bhajimchedhanu kreesthu naamamunuనే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును



Reference: క్రీస్తు మన కోసము శాపమై మనలను ... శాపము నుండి విమోచించెను. గలతీ Galatians 3:14

పల్లవి: నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను

1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ - వర్ణింప నెవ్వరికి తరమౌనా?
పాపిని నన్ను రక్షించుటకై - చూపేను ప్రేమన పారముగా

2. పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుడు - శాపగ్రాహియై చావొందెను

3. శోధన కాలముల యందున - వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు

4. ఎనలేని ప్రేమతో కౌగిలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు - మహిమతో వచ్చును మేఘముపై

5. రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే
పరమందు దూతలు యిహమందు నరులు - పాడుడి ప్రభునకు హల్లెలూయా



Reference: kreesthu mana koasamu shaapamai manalanu ... shaapamu nuMdi vimoachiMchenu. galathee Galatians 3:14

Chorus: nae sthuthiMchedhanu yaesu naamamunu - bhajiMchedhanu kreesthu naamamunu
sthuthiki yaesae yoagyudani - nithyM nithyM nae sthuthiMchedhanu

1. aa prabhu krupa praema kanikaramul - varNiMpa nevvariki tharamaunaa?
paapini nannu rakShiMchutakai - choopaenu praemana paaramugaa

2. paapamulanniyu baaputakai - shaapamulanniyu maaputakai
ae paapamerugani aa paavanudu - shaapagraahiyai chaavoMdhenu

3. shoaDhana kaalamula yMdhuna - vaedhana kaalamula yMdhun
naaDhudu yaesu manathoadanuMda - aMthamaegaa mana chiMthalaku

4. enalaeni praemathoa kaugiliMchenu - eMchalaeni maeLLathoa nannu niMpenu
mahaamahuMdu mahima praDhaanudu - mahimathoa vachchunu maeghamupai

5. raajaaDhiraaju prabhu yaesae - dhaevaadhidhaevudu mana yaesae
paramMdhu dhoothalu yihamMdhu narulu - paadudi prabhunaku hallelooyaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com