• waytochurch.com logo
Song # 4047

paedha naruni roopamu dharimchi yaesuraaju nee chemtha nilachae amgeekarimchu maayananuపేద నరుని రూపము దరించి యేసురాజు నీ చెంత నిలచే అంగీకరించు మాయనను



Reference: ఆయన ... మీ నిమిత్తము దరిద్రుడాయెను 2 కొరింథీ Corinthians 8:9

పల్లవి: పేద నరుని రూపము దరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను

1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె
ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె
నింద వేదన శ్రమలను సహించె
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలుచుచుండె

2. తలవాల్చుటకు ఇల స్థలమేలేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
పాట్లుపడె నిన్ను విడిపింపను

3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాపడాగులన్ రక్తముతో కడిగెన్
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందె

4. మాయలోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవు నిల
నిత్యదేవుని ప్రేమను నమ్మినీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో

5. తామసించెద వేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె



Reference: aayana ... mee nimiththamu dharidhrudaayenu 2 koriMThee Corinthians 8:9

Chorus: paedha naruni roopamu dhariMchi
yaesuraaju nee cheMtha nilachae
aMgeekariMchu maayananu

1. kaaLLa chaethulMdhu seelal kottabade
muLLamakutamu shirassuna pettabade
niMdha vaedhana shramalanu sahiMche
chiMdhe thanadhu rakthamu nee paapamukai
dheenudai ninnu piluchuchuMde

2. thalavaalchutaku ila sThalamaelaedhu
dhappi theerchukona neeru dhorakalaedhu
thannu aadhariMchu vaarevaru laeru
priya rakShkudu shiluvaloa vraelaade
paatlupade ninnu vidipiMpanu

3. prabhu saathaanu thalanu chithuka dhrokken
paapadaagulan rakthamuthoa kadigen
nee vyaaDhini vaedhana tholagiMch
nee shaapamu nuMdi vidipiMp
siluvaloa vijayamu poMdhe

4. maayaloakamunu neevu nammakumu
manuShyula manassu maaripoavu nil
nithyadhaevuni praemanu nammineevu
nishchayamugaa prabhuvuloa aanMdhiMp
naedae rammu vishvaasamuthoa

5. thaamasiMchedha vaela oa priyudaa
priya yaesuni yodhdhaku laechirammu
ee loakamu neekivvani shaaMthini
ee dhinamae prabhuvu neekosag
praemathoa ninnu pilachuchuMde



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com