• waytochurch.com logo
Song # 4056

thana raajyamunaku mahimaku pilachina mana prabhuvuku thaginattu nadichedhamuతన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడిచెదము



Reference: తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనుడి 1 థెస్స Thessalonians 2:11

పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము

1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2
మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2

2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును

3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును

4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు

5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము



Reference: thana raajyamunakunu mahimakunu mimmunu piluchuchunna dhaevuniki thaginattugaa meeru naduchukonudi 1 Thessa Thessalonians 2:11

Chorus: thana raajyamunaku mahimaku pilachina - 2
mana prabhuvuku thaginattu nadichedhamu
thana raajyamuloa manamu chaeredhamu

1. kaarucheekati kamminanu - yaesuni veluguloa nadichedhamu - 2
mMchi kaapari manathoanuMdaga - thanathoa muMdhukae saagedhamu - 2

2. iruku maargapu ibbMdhulaloa - siluvanu moayuchu veLLedhamu
yaesae manadhu bhaaramu moayuchu - manaku maargamu choopunu

3. uppoMguchunna upadhravamulaloa - unnavaadanani prabhuvanenu
aMthamu varaku cheMtha nilichi - thaanae manathoa nadachunu

4. dhaaritholagaka guri yodhdhakae - yaesunae choochi nadachedhamu
ihamuna shudhDhulai nadachuvaarae - paramuna prabhuvuthoa sMchariMchedharu

5. vishvaasamunu viduvaka - mMchi poaraatM poaraadi
prabhuvuthoa nadachi parugu mugiMchi - neethi kireetamu poMdhedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com