• waytochurch.com logo
Song # 4058

nithyamu niluchunadhi dhaevuni vaakyamuనిత్యము నిలుచునది దేవుని వాక్యము



Reference: గడ్డి యెండిపోవును. దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా Isaiah 40:8

Reference: క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి Timothy 2:3

Reference: కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ Philippians 4:19

పల్లవి: నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము
సత్యమై యున్నది - సర్వము చేయునది (2)

అను పల్లవి: ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము

1. అంధకారమును - తొలగించు జ్యోతి అది
ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2)
వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2)
ఆ వెలుగు వాక్యము

2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు - జీవనదియే అది
దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది
ఆ జీవ జలవాక్యము

3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది
రెండంచులు వాడీగలదై - వధించును వైరులను
ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు
ఆ శక్తిగల వాక్యము

4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా
శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది
తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము
ఆ దేవాది దేవుడు

5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు
జయించు వారినెల్ల - తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము
ప్రభుకొరకై కనిపెట్టుము
హల్లెలూయా హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ (2)



Reference: gaddi yeMdipoavunu. dhaani puvvu vaadipoavunu. mana dhaevuni vaakyamu nithyamu niluchunu. yeShyaa Isaiah 40:8

Reference: kreesthuyaesu yokka mMchi sainikunivale naathoa kooda shramanu anubhaviMchumu. 2 thimoathi Timothy 2:3

Reference: kaagaa dhaevudu thana aishvaryamu choppuna kreesthuyaesu nMdhu mahimaloa mee prathi avasaramunu theerchunu. philippee Philippians 4:19

Chorus: nithyamu - niluchunadhi - dhaevuni vaakyamu
sathyamai yunnadhi - sarvamu chaeyunadhi (2)

Chorus-2: aa vaakyamae yaesu dhaivamu - aadhiyMdhu unna dhaivamu (2)
aMthamae laeni dhaivamu

1. aMDhakaaramunu - tholagiMchu jyoathi adhi
prathi maniShini veligiMchu - mahima velugu adhi (2)
veligiMchunu - nadipiMchunu - throavaku dheepamai (2)
aa velugu vaakyamu

2. eMdina edaariloa - neeti ootavMtidhi
vadigaa pravahiMchu - jeevanadhiyae adhi
dhappigonina - prathi jeevi - dhappika theerchunadhi
aa jeeva jalavaakyamu

3. apavaadhini aNachivaese - aathmakhadgamadhi
reMdMchulu vaadeegaladhai - vaDhiMchunu vairulanu
oadiMchunu - vidipiMchunu - thoadai ellappudu
aa shakthigala vaakyamu

4. poaraadumu yaesukai - mMchi sainikunigaa
shramalanu bhariMchumu - vaakyamuloa balamoMdhi
thana aishvaryamuloa - theerchunu - nee prathi avasaramu
aa dhaevaadhi dhaevudu

5. nithyudagu dhaevudu - thvaragaa vachchuchunnaadu
jayiMchu vaarinella - thanathoa konipoavunu
thana vaakyamunMdhu varDhilluchu - vijayudavai yuMdumu
prabhukorakai kanipettumu
hallelooyaa hallelooya - hallelooyaa hallelooya (2)



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com