• waytochurch.com logo
Song # 4063

nee rekkala chaatuna sharanomdhedhanనీ రెక్కల చాటున శరణొందెదన్



Reference: నీవు నాకు సహాయకుడవై యుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. కీర్తన Psalm 63:7

పల్లవి: నీ రెక్కల చాటున శరణొందెదన్ (2)
నా విశ్రమ గృహమైన ప్రభువా (2)
మొఱ్ఱ పెట్టెదను ఉత్సహించెదను (2)
మిగిలిన జీవిత కాలమంతయును (2)

1. అలసితిని నే నవిధేయతతో (2)
కృంగితి నేను పాపము చేతన్ (2)
లేపితివి నన్ను హత్తుకొంటివి
నీవు మోపిన కాడి - నాకు విశ్రాంతి

2. గువ్వను పోలి ఎగిరి పోదును
నెమ్మది నొందెదనని తలచితిని
లేదు లేదు విశ్రాంతెచ్చట
నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్

3. చేసితివి మాతో వాగ్దానమును
నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్
మానెదము మా ప్రయాసమును
పొందెదము క్రీస్తులో విశ్రాంతిని

4. సిలువపై శ్రమలొందితివి
కార్చితివి నీ రక్తము మాకై
లేచితివి నీవు మరణము గెల్చి
కూర్చితివి నీ సంఘముగా మమ్ము

5. భంగపరచితి నీ విశ్రాంతిని
యాకోబువంటి నా నడవడితో
మార్పు నొందితి - బేతేలు నందు
ఇక విశ్రమించుము - నాలో ప్రభువా



Reference: neevu naaku sahaayakudavai yuMtivi. nee rekkala chaatuna sharaNujochchi uthsaahaDhvani chaesedhanu. keerthana Psalm 63:7

Chorus: nee rekkala chaatuna sharaNoMdhedhan (2)
naa vishrama gruhamaina prabhuvaa (2)
moRRa pettedhanu uthsahiMchedhanu (2)
migilina jeevitha kaalamMthayunu (2)

1. alasithini nae naviDhaeyathathoa (2)
kruMgithi naenu paapamu chaethan (2)
laepithivi nannu haththukoMtivi
neevu moapina kaadi - naaku vishraaMthi

2. guvvanu poali egiri poadhunu
nemmadhi noMdhedhanani thalachithini
laedhu laedhu vishraaMthechchat
nee vishraaMthiloa thirigi nae chaerithin

3. chaesithivi maathoa vaagdhaanamunu
nee vishraaMthiloa pravaeshiMpachaeyan
maanedhamu maa prayaasamunu
poMdhedhamu kreesthuloa vishraaMthini

4. siluvapai shramaloMdhithivi
kaarchithivi nee rakthamu maakai
laechithivi neevu maraNamu gelchi
koorchithivi nee sMghamugaa mammu

5. bhMgaparachithi nee vishraaMthini
yaakoabuvMti naa nadavadithoa
maarpu noMdhithi - baethaelu nMdhu
ika vishramiMchumu - naaloa prabhuvaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com