pallavarapu komdalapaina prabhudhaasulu praarthimpaganuపల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను
Reference: నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన Psalm 32:8
Reference: తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతములు Chronicles 16:9
పల్లవి: పల్లవరపు కొండలపైన
ప్రభుదాసులు ప్రార్థింపగను
ఆహా పౌలుకు చూపిన రీతిన్ |
పరలోక సంఘదర్శనమిచ్చెన్ |(2)
అను పల్లవి: తొలిప్రేమ కలిగి అందరము |
బలియైన క్రీస్తును ప్రకటించి |(2)
మారాను పోలిన శ్రమలున్నా |
కానాను పురముకు చేరుదము |(2)
1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల
ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము
2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల
అపకారము మాని - డంబమును విడచెదము
సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో
సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము
3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము
4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు
దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము
చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము
చిరకాలము దేవుని మందిర తేజో మహిమలో వసియించెదము
5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి
యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి
పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము
పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము
6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన
సంతోషము కలిగి సువార్తను చాటెదము
ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము
ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని
Reference: neeku upadhaeshamu chaesedhanu neevu nadavavalasina maargamunu neeku boaDhiMchedhanu. neemeedha dhruShtiyuMchi neeku aaloachana cheppedhanu. keerthana Psalm 32:8
Reference: thanayedala yaThaarThahrudhayamugalavaarini balaparachutakai yehoavaa kanudhruShti loakamMdhMthata sMchaaramu chaeyuchunnadhi. 2 dhinavruththaaMthamulu Chronicles 16:9
Chorus: pallavarapu koMdalapain
prabhudhaasulu praarThiMpaganu
aahaa pauluku choopina reethin |
paraloaka sMghadharshanamichchen |(2)
Chorus-2: tholipraema kaligi aMdharamu |
baliyaina kreesthunu prakatiMchi |(2)
maaraanu poalina shramalunnaa |
kaanaanu puramuku chaerudhamu |(2)
1. aposthalula boaDha - sahavaasamu prabhu ball
praarThana jeevithamu - sMgha dharshanamunaku moolM
ee aathmeeya lMgarulanu kaligi - konasaagedhamu thuphaanulaloa
ee aathmeeya lMgarulanu kaligi - ee paapa samudhramu dhaatedhamu
2. vishvaasamu praema - nireekShNa niluchunil
apakaaramu maani - dMbamunu vidachedhamu
soadhara praemalaenichoa - vyarThulamu mana mee loakamuloa
soadhara praemalaenichoa mroagedi thaaLamu vale nuMdedhamu
3. dhaevuni chiththamunu - erigi jeeviMchedhamu
prabhu chiththamu koraku - chelliMchedhamu krayamu
dhaevaa nee chiththamu neravaercha - maakeMthoa sMthoaShmu
dhaevaa nee chiththamu neravaercha - neekeMthoa sMthoaShmu
4. dhaevuni mMdhiramun - praemiMchedhamellappudu
dhaevuni vaakyamunu - aalayamuloa DhyaaniMthumu
chirakaalamu dhaevuni mMdhiramuloa - nivasiMchi sthuthiyiMchedhamu
chirakaalamu dhaevuni mMdhira thaejoa mahimaloa vasiyiMchedhamu
5. aathmathoa sathyamuthoa - nija aaraaDhana kaligi
yaDhaarTha hrudhayamuthoa - mMchi saakShyamunu kaligi
pedhavula padhamulu kaadhani - mana hrudhayamulanu arpiMchedhamu
pedhavula padhamulu kaadhani - hebroanu prabhuni koniyaadedhamu
6. cheppanashakyamunu - mahimaa yukthamunain
sMthoaShmu kaligi suvaarthanu chaatedhamu
aakaashamu kriMdha ae naamamuna - rakShNa laedhani chaatedhamu
aakaashamu kriMdha yaesu naamamunae - paapakShmaapaNa kalugunani