gesthemane thota గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా
పల్లవి: గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను ఆ...ఆ...ఆ...ఆ... || గెత్సేమనే|| 1. నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి || గెత్సేమనే|| 2. ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే||