jayahe jayahe జయహే జయహే జయహే జయహే జయ జయ దేవ సుథ
పల్లవి: జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే 1. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహే 2. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహే 3. స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే