• waytochurch.com logo
Song # 453

e samayamandhaina ఏ సమయమందైన ఏ స్ధలమందైన


ఏ సమయమందైన ఏ స్ధలమందైన
ఏ స్ధితిలో నేనున్న స్తుతిపాడెదన్‌
ఆరాధన (2) నా ప్రెయుడేసు క్రీస్తుకే ఆరాధన
ఆరాధన (2) గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధన

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరవు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్నను
యేసు నామమే ఆధారము కాగ
యేసు రక్తమే నా విజయము
పగటి ఎండలో రాత్రి వెన్నెలలో
కునుకకకాపాడు యేసు దేవునికే ఆరాధన

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్‌
యెహోవా రాఫా నన్ను స్వస్ధపరచున్‌
యెహోవా షమ్మా నాకు తోడుగా
యెహోవా నిస్ని నా ధ్వజముగా
అల్ఫా ఓమేగా ఆది దేవునికే ఆరాధన


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com