• waytochurch.com logo
Song # 47

dhevuni vaarasulam దేవుని వారసులం ప్రేమ నివాసులము


పల్లవి: దేవుని వారసులం - ప్రేమ నివాసులము

జీవన యాత్రికులం - యేసుని దాసులము

నవ యుగ సైనికులం - పరలోక పౌరులము

హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము

1. దారుణ హింస లలో - దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో - ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము

2. పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము

పరమాత్ముని రాక - బలము ప్రసాదింప

ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము

3. అనుదిన కూటములు - అందరి గృహములలో

ఆనందముతోను - ఆరాధనలాయే

వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com