aparaadini yesaiah అపరాదిని యేసయ్యా
అపరాదిని యేసయ్యాఅపరాధిని యేసయ్య పల్లవి: అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యానెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని.. 1. సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితినికలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని.. 2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనేమిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని.. 3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితినావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని.. 4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితిద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని.. 5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితినిక్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..