• waytochurch.com logo
Song # 517

పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో

palle pallello pattanala moolallo


పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో
వాడ వాడల్లో సొగసైన మేడల్లో
యేసు వార్త చాటను పదరో తమ్ముడా
నాకేమి అనబోకురో

1. ఈ సువార్త అసలు వినని జనులెందరో
యేసు లేక నశియుంచు ప్రజలెందరో
ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది
దారి చూపే నికీయబడినది
యేసయ్యా నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో

2. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరుకుంటావా
సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా
కోతెంతో వున్నా పనివారు లేరని
అడుగుచున్నాడేసు తన పని చేయమని
యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో

3. రాకడకు గురుతులు కనిపించుచుండగా
అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా
సమయం అసమయమనక సందేహపడక
దొరికిన అవకాశమేది జారవిడువక
యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరో


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com