• waytochurch.com logo
Song # 524

gadachina kaalamantha గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత


గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత
నడిపితివి కృపచేత యేసయ్యా
విడువక కాచిన నా ప్రాణదాతా

అ.ప: ఆరాధన - ఆరాధన - నీకే నీకే విశ్వనేత

1. చీకటి కామ్ముకురాగా - మార్గము మూసుకుపొగా
నను ఆగిపోనీలేదే
అరణ్యములో బాటలు వేసి - వంకర త్రోవలు తిన్నగ చేసి
క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా

2. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా
నను ఓడిపోనీలేదే
విరోధులను ఆటంకపరచి - నా పక్షమున యుద్దము జరిపి
విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా

3. జగతికి యేసుని చూపించి - జనులకు రక్షణ చాటించి
ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com