• waytochurch.com logo
  • Song - 5535 : ae reethi sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో Lyrics

  • Quick search
  • ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
    నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
    తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
    నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
    నేను నీ వాడనో యేసువా        ||ఏ రీతి||

    వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
    రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2)        ||నా ప్రాణ||

    మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
    సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి (2)        ||నా ప్రాణ||

    ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
    ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2)        ||నా ప్రాణ||

    Language:Telugu | 876 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557617
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com