thraahi maam kreesthu naadhadhayaojooda raavae naenudhaehi yanuchu neeత్రాహి మాం క్రీస్తు నాధదయఁజూడ రావే నేనుదేహి యనుచు నీ
త్రాహి మాం క్రీస్తు నాధ-దయఁజూడ రావే = నేను-దేహి యనుచు నీపాదములే - దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||1గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుఁడనై - రవ్వపాలై నే నెంతో - నెవ్వఁబొందితిఁ - త్రవ్వుచున్న కొలఁదిఁ - పెరుఁగుఁ- దరగదు నా పాప రాశి- యివ్విధమునఁ జెడిపోతినినే - నేమి సేతు నో¬¬¬ ||త్రాహి||2.నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁ బూని - చేయరానిదుష్కర్మములు చేసినాఁడను = దయ్యాలరాజు చేతిలో ఁ - జేయి వేసి వానిపనులఁ- జేయ సాగి నే నిబ్భంగిఁ - జెడిపపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||3.నిబ్బర మొక్కంచుకైన-నిజము రవ్వంతైన లేక- దబ్బర లాడుటకుము-త్తాత నైతిని= అబ్బురమైన ఘోర పా -పాంధకార కూపమందు -దబ్బున బడిపోయినయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||