• waytochurch.com logo
Song # 5601

nee vaakyamae nannu brathikimchenu baadhalaloa nemmadhi nichchenuనీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను


నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాసత్య దయాశక్తి సంపూర్ణుడా
వాక్యమై యున్న యేసు వందనమయ్య ||నీ వాక్యమే||

1.పాలవంటిది జుంటితేనె వంటిదీ
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్న అయినది
రత్న రాసులకన్న కోరదగినది ||నీ వాక్యమే||

2.జిగటగల ఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నన్ను నడిపెను ||నీ వాక్యమే||

3.శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ||నీ వాక్యమే||

nee vaakyamae nannu brathikiMchenu - baaDhalaloa nemmadhi nichchenu
krupaasathya dhayaashakthi sMpoorNudaa
vaakyamai yunna yaesu vMdhanamayya ||nee vaakyamae||

1.paalavMtidhi juMtithaene vMtidhee
naa jihvaku mahaa maDhuramainadhi
maelimi bMgaarukanna minna ayinadhi
rathna raasulakanna koaradhaginadhi ||nee vaakyamae||

2.jigatagala oobi nuMdi laevaneththenu
samathalamagu bhoomipai nannu nilipenu
naa paadhamulaku dheepamaayenu
sathyamaina maargamuloa nannu nadipenu ||nee vaakyamae||

3.shathruvulanu edhurkonae sarvaaMga kavachamai
yudhDhamunaku sidhDhamanassu nichchuchunnadhi
apavaadhi vaeyuchunna agnibaaNamulanu
khadgamuvale addukoni aarpivaeyuchunnadhi ||nee vaakyamae||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com