విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్
vijaya geethamul paadarae kreesthuku jaya vijaya geethamul
విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్
పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ -
నిజకుమారుని నామమునే - హృదయములతో - భజన
జేయుచు నిత్యమున్ ||విజయ||
1.మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెను
నింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు
మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్-
క్రుంగ్ నిలిపి చీల్చెను ||విజయ||
2.పాపముల్ దొలగింపను-మనలను దన స్వ-రూపంబున
కు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ-
మున్ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మన
కొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్ -
ధీరుడై నెర వేర్చెను ||విజయ||
3.సిలువ మరణము నొందియు-మనలను దనకై-గెలువన్
లేచిన వానికి - చేలువుగన్ విమాలాత్ముని-ప్రేమను మనలో -
నిలువన జేసిన వానికి - కొలువు జేతుమేగాని - ఇలను
మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాలా -
విలువ గలదని చాటుచు ||విజయ||
vijaya geethamul paadarae - kreesthuku jaya - vijaya geethamul
paadarae - vrujina mMthatee meedha - vijayamichchaedae dhaeva -
nijakumaaruni naamamunae - hrudhayamulathoa - bhajan
jaeyuchu nithyamun ||vijaya||
1.mMgaLamuga yaesudae - manaku rakShNa - shruMgamai marinilchenu
niMgini vidachi vachchaenu - shathruni yudhDha - rMgamMdhuna gelchenu - rMgu
meeragadhana-rakthabalamu valana-poMgu naNagajaesenu - saathaanuni bal-
kruMg nilipi cheelchenu ||vijaya||
2.paapamul dholagiMpanu-manalanu dhana sva-roopMbun
ku maarchanu-shaapM bMthayu noarchenu-dhaevuni nyaaya-
mun bhariyiMchenu-paapamerugani yaesu - paapamai man
koraku-paapa yaagamu dheerchaenu - dhaevuni neethin -
Dheerudai nera vaerchenu ||vijaya||
3.siluva maraNamu noMdhiyu-manalanu dhanakai-geluvan
laechina vaaniki - chaeluvugan vimaalaathmuni-praemanu manaloa -
niluvana jaesina vaaniki - koluvu jaethumaegaani - ilanu
maruvaka vaani - siluva moayuchu nee krupaa - rakShNa chaalaa -
viluva galadhani chaatuchu ||vijaya||