సర్వకృపానిదియగు ప్రభువా
sarvakrupaanidhiyagu prabhuvaa
సర్వకృపానిదియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము
సంతోషముగా నిను పొగడెదము ||సర్వ||
హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదము
ఆనందముతో సాగెదము
1.ప్రేమించి నన్ను వెదికితివి
ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై
పాపిని నన్ను కరుణించితివి ||సర్వ||
2.అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాదుని అడుగు జాడలలో
నడుచుటకు నను పిలిచితివి ||సర్వ||
3.మరణ శరీరము మార్పు నొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి
మరణ భయములను తీర్చితివి ||సర్వ||
sarvakrupaanidhiyagu prabhuvaa
sakala charaachara sMthoaShmaa
sthoathramu chaesi sthuthiMchedhamu
sMthoaShmugaa ninu pogadedhamu ||sarva||
hallelooya hallelooyaa
hallelooyaa hallelooyaa
hallelooyaa yani paadedhamu
aanMdhamuthoa saagedhamu
1.praemiMchi nannu vedhikithivi
preethithoa nannu rakShiMchithivi
parishudhDhamuga jeeviMchutakai
paapini nannu karuNiMchithivi ||sarva||
2.alpakaalashramalanubhaviMpa - anudhinamu krupanichchithivi
naadhuni adugu jaadalaloa
naduchutaku nanu pilichithivi ||sarva||
3.maraNa shareeramu maarpu noMdhi
mahima shareeramu poMdhutakai
mahimaathmathoa nannu niMpithivi
maraNa bhayamulanu theerchithivi ||sarva||