• waytochurch.com logo
Song # 5665

ae paapamerugani yoa paavana moorthi paapa vimoachakumdఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండ


ఏ పాపమెరుగని - యో పావన మూర్తి - పాప విమోచకుండ
నా పాలిదైవమా - నా పాపముల కొర - కీపాట్లు నొందినావా

1.ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా

2.కలువరిగిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - దులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా

3.చెడుగు యూదులు బెట్టు - పడరానిపాట్లకు - సుడివడి నడిచినావా
కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను - గ్రక్కున దించినావా

4.ఆ కాలకర్ములు - భీకరంబుగ నిన్ను - యా కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా

5.పలు విధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తిమొరలిడితివా
సిలువపై బలుమారు - కలుగుచుండెడి బాధ - వలనదాహమునాయెనా

6.బల్లిదుండగుబంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లబడ బొడిచినాడా
ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - జల్లారెగదె కోపము

7.కటకటా పాపసం - కటము బాపుటకింత - పలు బాధనొందినావా
ఎటువంటిదీ ప్రేమ - ఎటువంటిదీ శాంత - మెటులవర్ణింతు స్వామి

ae paapamerugani - yoa paavana moorthi - paapa vimoachakuMd
naa paalidhaivamaa - naa paapamula kora - keepaatlu noMdhinaavaa

1.muLLathoa kireeta - malli nee shiramupai - jallaatamuna moththiraa
muLLa poatlaku shiramu - thalladillaga somma - sillipoathiva rakShkaa

2.kaluvarigiri dhanuka - siluva moayalaeka - kalavaramu noMdhinaavaa
siluva neethoa moaya - dhuluvalu vaerokani - thoadugaa nichchinaaraa

3.chedugu yoodhulu bettu - padaraanipaatlaku - sudivadi nadichinaavaa
kadaku kalvarigiri - kadakaegi silvanu - grakkuna dhiMchinaavaa

4.aa kaalakarmulu - bheekarMbuga ninnu - yaa koyyapai nuMchiraa
nee kaalu saethulu - aa koyyakae soodhi - maekulathoa gruchchinaaraa

5.palu viDhMbula shramalu - chelaraega dhMdriki - nelugeththimoralidithivaa
siluvapai balumaaru - kaluguchuMdedi baaDha - valanadhaahamunaayenaa

6.ballidhuMdagubMtu - ballemuna nee prakka - jillabada bodichinaadaa
ulloalamulavale - nalla neerubukMga - jallaaregadhe koapamu

7.katakataa paapasM - katamu baaputakiMtha - palu baaDhanoMdhinaavaa
etuvMtidhee praema - etuvMtidhee shaaMtha - metulavarNiMthu svaami

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com