ae paapamerugani yoa paavana moorthi paapa vimoachakumdఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండ
ఏ పాపమెరుగని - యో పావన మూర్తి - పాప విమోచకుండనా పాలిదైవమా - నా పాపముల కొర - కీపాట్లు నొందినావా1.ముళ్ళతో కిరీట - మల్లి నీ శిరముపై - జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము - తల్లడిల్లగ సొమ్మ - సిల్లిపోతివ రక్షకా2.కలువరిగిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా సిలువ నీతో మోయ - దులువలు వేరొకని - తోడుగా నిచ్చినారా3.చెడుగు యూదులు బెట్టు - పడరానిపాట్లకు - సుడివడి నడిచినావా కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను - గ్రక్కున దించినావా4.ఆ కాలకర్ములు - భీకరంబుగ నిన్ను - యా కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు - ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా5.పలు విధంబుల శ్రమలు - చెలరేగ దండ్రికి - నెలుగెత్తిమొరలిడితివా సిలువపై బలుమారు - కలుగుచుండెడి బాధ - వలనదాహమునాయెనా6.బల్లిదుండగుబంటు - బల్లెమున నీ ప్రక్క - జిల్లబడ బొడిచినాడా ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ - జల్లారెగదె కోపము7.కటకటా పాపసం - కటము బాపుటకింత - పలు బాధనొందినావా ఎటువంటిదీ ప్రేమ - ఎటువంటిదీ శాంత - మెటులవర్ణింతు స్వామి
ae paapamerugani - yoa paavana moorthi - paapa vimoachakuMdnaa paalidhaivamaa - naa paapamula kora - keepaatlu noMdhinaavaa1.muLLathoa kireeta - malli nee shiramupai - jallaatamuna moththiraa muLLa poatlaku shiramu - thalladillaga somma - sillipoathiva rakShkaa2.kaluvarigiri dhanuka - siluva moayalaeka - kalavaramu noMdhinaavaa siluva neethoa moaya - dhuluvalu vaerokani - thoadugaa nichchinaaraa3.chedugu yoodhulu bettu - padaraanipaatlaku - sudivadi nadichinaavaa kadaku kalvarigiri - kadakaegi silvanu - grakkuna dhiMchinaavaa4.aa kaalakarmulu - bheekarMbuga ninnu - yaa koyyapai nuMchiraa nee kaalu saethulu - aa koyyakae soodhi - maekulathoa gruchchinaaraa5.palu viDhMbula shramalu - chelaraega dhMdriki - nelugeththimoralidithivaa siluvapai balumaaru - kaluguchuMdedi baaDha - valanadhaahamunaayenaa6.ballidhuMdagubMtu - ballemuna nee prakka - jillabada bodichinaadaa ulloalamulavale - nalla neerubukMga - jallaaregadhe koapamu7.katakataa paapasM - katamu baaputakiMtha - palu baaDhanoMdhinaavaa etuvMtidhee praema - etuvMtidhee shaaMtha - metulavarNiMthu svaami