• waytochurch.com logo
Song # 5676

kavulakainaa saadhyamaa nee krupanu varnimchadmకవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం


కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం (2)
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకంలో
ఏ వైద్యునికి సాధ్యము (2)||కవులకైనా||

క్షణికమైన అనురాగాలు
ఆవిరివంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు
నిలచిపోయే అనుబంధాలు (2)
నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
స్వార్ధపూరిత ఈ లోకంలో
ఏ మిత్రునికి సాధ్యము (2)||కవులకైనా||

kavulakainaa saaDhyamaa nee krupanu varNiMchadM
praeyasikainaa saaDhyamaa nee praemanu aMdhiMchadM
shilpikainaa saaDhyamaa neelaa nirmiMchadM
raajukainaa saaDhyamaa neelaa varameeyadM (2) ||kavulakainaa||

chedharina manasulakoo shaaMthi
kruMgina hrudhikee oadhaarpu
mruthyu dhaehamukoo jeevM
balaheenulaku aaroagyM (2)
parama vaidhyunigaa neevu chaesae svasThathaa kaaryaalu
gaayapadina nee hasthamu chaesae adhbhutha kaaryaalu
moasapooritha ee loakMloa
ae vaidhyuniki saaDhyamu (2)||kavulakainaa||

kShNikamaina anuraagaalu
aavirivMti aapyaayathalu
avasaraala abhimaanaalu
nilachipoayae anubMDhaalu (2)
navyakaaMthulamayamaina needhu kalvari praem
aanMdhajvaalalu kaligiMchae needhu nirmala snaehM
svaarDhapooritha ee loakMloa
ae mithruniki saaDhyamu (2)||kavulakainaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com