• waytochurch.com logo
Song # 5684

dhaevuni praemaidhigoa janulaaraa bhaavmbunmdheliyaraeదేవుని ప్రేమఇదిగో జనులారా భావంబునందెలియరే


దేవుని ప్రేమఇదిగో - జనులారా భావంబునందెలియరే

కేవలము నమ్ముకొనిన - పరలోక జీవంబు మనకబ్బును ||దేవుని||



1.సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను

సర్వోపకారుడుండె - మన మీద జాలిపరుడై యుండెను ||దేవుని||

2.మానవుల రక్షింపను దేవుండుతన కుమారుని బంపెను మన

శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే ||దేవుని||

3.యేసు క్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోస

కారిజనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని||

4.పాపబారంబుతోడ నేప్రొద్దు - ప్రయాసములు బొందెడి

పాపులందురు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణ మిత్తుననెను ||దేవుని||

5.సత్తులైన పురుషులైనన్‌ - యాకర్త సర్వజనుల యెడలను

సత్ప్రేమగ నడిచెను - పరలోక సద్భోదలిక జేసెను ||దేవుని||

6.చావు నొందిక కొందరిన్‌ - యేసుండు - చక్కగ బ్రతికించెను

సకల వ్యాధుల రోగులు - ప్రభునంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||

7.గాలి సంద్రపు పొంగులన్‌ - సద్ధణపి - నీళ్లపై నడచినాడే

మేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగజేసెను ||దేవుని||

8.చేతుల కాళ్లలోనూ రా రాజు - చేర మేకులు బొందెను

పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వ లేకన్‌ ||దేవుని||

9.ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాపరులను

మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను ||దేవుని||

10.రక్షకుడు శ్రమబొందగా దేశంబు తక్షణము చీకటియ్యెను

రక్షకుడు మృతి నొందగా - తెర చినిగి - రాతి కొండలు పగిలెను|| దేవుని|

11. రాతి సమాధిలోను - రక్షకుని నీతిగల దేహంబును - పాతి

పెట్టిరి భక్తులు - నమ్మిన నాదలందఱు జూడగా ||దేవుని||

12. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు

నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్‌ ||దేవుని||

13. పదినొకండు మారులు వారలకు - ప్రత్యక్షుడాయెనేను

పరలోకమునకేగెను - తన వార్త ప్రకటించమని పల్కెను ||దేవుని||

14. నమ్మి బాప్తిస్మ మెందు - నరులకు - రక్షణ మరి కల్గును

నమ్మనొల్లక పోయెడు - నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||

dhaevuni praemaidhigoa - janulaaraa bhaavMbunMdheliyarae

kaevalamu nammukonina - paraloaka jeevMbu manakabbunu ||dhaevuni||



1.sarvaloakamu manalanu thana vaakya sathyMbuthoa jaesenu

sarvoapakaaruduMde - mana meedha jaaliparudai yuMdenu ||dhaevuni||

2.maanavula rakShiMpanu dhaevuMduthana kumaaruni bMpenu man

shareeramu dhaalchenu aa prabhuvu mana paapamulaku dhoorudae ||dhaevuni||

3.yaesu kreesthunu paeruna rakShkudu velasinaadila loapala dhoas

kaarijanulathoa - neMthoa su - bhaaShlanu balkinaadu ||dhaevuni||

4.paapabaarMbuthoada naeprodhdhu - prayaasamulu boMdhedi

paapulMdhuru nammina - vishraaMthi - paripoorNa miththunanenu ||dhaevuni||

5.saththulaina puruShulainan? - yaakartha sarvajanula yedalanu

sathpraemaga nadichenu - paraloaka sadhbhoadhalika jaesenu ||dhaevuni||

6.chaavu noMdhika koMdharin? - yaesuMdu - chakkaga brathikiMchenu

sakala vyaaDhula roagulu - prabhunMti - svasThMbu thaa moMdhiri ||dhaevuni||

7.gaali sMdhrapu poMgulan? - sadhDhaNapi - neeLlapai nadachinaadae

maelugala yadhbhuthamulu eelaagu vaelakoladhigajaesenu ||dhaevuni||

8.chaethula kaaLlaloanoo raa raaju - chaera maekulu boMdhenu

paathakulu gottinaarae parishudhDha neethi thaamoarva laekan? ||dhaevuni||

9.inni baaDhalu bettuchu - dhanu jMpu - chunna paaparulanu

manniMchumani thMdrini yaesuMdu sannuthithoa vaedenu ||dhaevuni||

10.rakShkudu shramaboMdhagaa dhaeshMbu thakShNamu cheekatiyyenu

rakShkudu mruthi noMdhagaa - thera chinigi - raathi koMdalu pagilenu|| dhaevuni|

11. raathi samaaDhiloanu - rakShkuni neethigala dhaehMbunu - paathi

pettiri bhakthulu - nammina naadhalMdhaRu joodagaa ||dhaevuni||

12. moodava dhinamMdhuna yaesuMdu mruthi gelchi laechinaadu

naadu nammina manujulu - choochiri - naluvadhi dhinamulMdhun? ||dhaevuni||

13. padhinokMdu maarulu vaaralaku - prathyakShudaayenaenu

paraloakamunakaegenu - thana vaartha prakatiMchamani palkenu ||dhaevuni||

14. nammi baapthisma meMdhu - narulaku - rakShNa mari kalgunu

nammanollaka poayedu - narulaku narakMbu sidhDhamanenu ||dhaevuni||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com