• waytochurch.com logo
Song # 5774

daiva kutumbam దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం


దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం "2"
శాంతి శంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం "2"
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు "2"
ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు "2"
దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం "4"
"దైవకుటుంబం"

1. రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం "2"
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
క్షడ్రుజుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట "2"
అష్టైశ్వర్యాలకు తులతూగే కుటుంబం "2"
తరతరాలు వర్ధిల్లే కుటుంబం "2""దైవకుటుంబపు"

2. మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు "2"
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు"2"
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం "2"

daiva kutumbam dharanilo devuni prathibimbam (2)
shaanthi santhoshaalaku adi nilayam
aapyaayatha anuraagaalaku ika aarambham (2)
vishwaasapu vaakillu parishuddhatha logillu (2)
aathithyamichche vantillu vardhillu noorellu (2)
daiva kutumbapu santhosham
kani vini erugani aanandam (4) ||daiva kutumbam||

rakshana pondina kutumbam moksha puriki sopaanam
krama shikshana kaligina kutumbam veekshinchu daiva saanidhyam (2)
apaardhaalu aantharaalu lenatti anyonyatha
shadruchula ghuma ghumalu gubhaalinchi maa inta (2)
ashtaishwaryaalaku thulathooge kutumbam (2)
thara tharaalu vardhille kutumbam (2) ||daiva kutumbapu||

mamathalu kaligina kutumbam santhrupthinichche kutumbam
dhaanya dhana vasthu vaahanaalu kaavu maa yinti kambhaalu (2)
bhaya bhakthulu devokthulu maa anna paanaalu
maa yokka nattintlo vasiyinchunu devudu (2)
penavesukunna bandhaale ee kutumbam (2) ||daiva kutumbapu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com