• waytochurch.com logo
Song # 5787

vullasinchi pata pade pavurama ఉల్లసించి పాట పాడే పావురమా మృధు మధుర సుందర నారీమణీ


మృధు మధుర సుందర నారీమణీ
ఎద పవళించు నా ప్రాణేశ్వరీ
ఒక్క చూపుతో నీవాడనైతి
ఒక్క పిలుపుతో నీ వశమైతి
పావురమా నా పావురమా
నా నిర్మల హృదయమా... నా పావురమా

ఉల్లసించి పాటపాడే పావురమా
ఓ ఓ ఓ పుష్పమా.. షారోను పుష్పమా
వాగ్దానదేశపు అభిషేక పద్మమా
లెబనోను పర్వత సౌందర్యమా
1॰
పాలుతేనెలో పవళించి
పరిమళ వాసనలు విరజిమ్ము
జీవజలాలలో విహరించి
జీవఫలాలను ఫలియించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
॥ఓ ఓ ఓ పుష్పమా॥
2॰
జల్ధరు వాసనలు శ్వాసించి
జగతికి జీవమును అందించు
సంధ్యారాగము సంధించి
సుమధుర స్వరమును వినిపించు
ఉల్లసించి పాటపాడే పావురమా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
॥ఓ ఓ ఓ పుష్పమా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com