• waytochurch.com logo
Song # 5788

peruke kraisthavulara పేరుకే క్రైస్తవులారా


పేరుకే క్రైస్తవులారా
నులివెచ్చని క్రైస్తవులారా }॥2॥
మాదిరి లేని క్రైస్తవులారా }
ఆదివారపు క్రైస్తవులారా }॥2॥
ఈ పాటలోని మాటలతో మేలుకో }
నిజ క్రైస్తవమేదో తెలుసుకో }॥2॥॥పేరుకే॥
1॰
క్రీస్తునామధారులమని సాక్ష్యమిత్తురు }
సాతాను క్రియలలో పాల్గొందురు }
క్రీస్తునామధారులమని చెప్పుకుందురు }॥2॥
సాతాను క్రియలలో పాల్గొందురు }
పాపములను ఒప్పుకుందురు }
కాని విడిచిపెట్టక కప్పుకుందురు }॥2॥
మారుమనసు అనుభవమే }
యెరుగకుందురు }॥2॥ ౹౹పేరుకే౹౹
2॰
క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి }
క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచీ }॥2॥
పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు ॥2॥
ప్రభో ప్రభని పదేపదే ప్రార్థింతురు ॥2౹౹ పేరుకే౹౹
3॰
కడు రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు }
బహు దివ్యముగా బోధలెన్నొ చేయగలరూ }
కడు రమ్యముగా పాటలెన్నొ వ్రాయచుందురు }॥2॥
బహు దివ్యముగా బోధలెన్నొ వినుచుందురు }
కాని వారి హృదయము ప్రభుకు దూరము }
మరి సాతానుకు నిత్య నిలయము }॥2॥
పై పెదవులతో ఘనపరతురు }
ప్రభువునామము }॥2॥ ౹౹పేరుకే౹౹
4॰
సత్యమందు ప్రతిష్టింపబడిన వారలు నిత్య } రాజ్యమందు చేరువారు యోగ్యులు }॥2॥
పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు }
పరిశుద్ధులుగా ఇల జీవించువారలు }॥2॥
నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు ॥2॥
॥పేరుకే క్రైస్తవులారా॥

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com