యేసు రక్తమే జయము
yesu rakthame jayamu
యేసు రక్తమే జయము పరిశుధ్ధ రక్తమే జయము ॥2॥నా కొరకూ మానవులందరి కొరకు కార్చిన రక్తముకే జయము ॥2॥ ॥యేసు రక్తమే॥ 1॰యెరుషలేము వీధులలో చిందించిన రక్తము పాపుల కొరకై కార్చబడిన రక్తము ॥2॥ప్రేమకు ప్రతిరూపముగా కార్చబడిన రక్తముపరిపూర్ణతకై చిందించిన రక్తము ॥2॥ ॥యేసు రక్తమే॥ 2॰కల్వరి సిలువపై చిందించిన రక్తము చివరి బొట్టు వరకు కార్చబడిన రక్తము ॥2॥చీకటిని తొలగించుటకై చిందించిన రక్తము వారసత్వమిచ్చుటకై కార్చబడిన రక్తము ॥2॥ ॥యేసు రక్తమే॥