• waytochurch.com logo
Song # 5796

యేసుండగా నీకండగా దిగులేల నోసోదరా

yesundaga neekandaga dhigulela nosodhara


యేసుండగా నీకండగా దిగులేల నోసోదరా
యేసుండగా నీకండగా దిగులేల నోసోదరీ ॥2॥
నిను కాపాడి నిను రక్షించుటకు ॥2॥
తన ప్రాణాన్నే అర్పించినాడు ॥యేసుండగా॥
1॰
నీ నావలో తుఫానులే చెలరేగినా
ఎర్ర సంద్రమే ఎదురు వచ్చినా ॥2॥
ఫరో సైన్యమే తరుముతు ఉన్నా
పగవారే నిన్ను నిందించినా ॥2॥
॥యేసుండగా॥
2॰
నీ యాత్రలో దుఃఖములు ఎన్ని జరిగినా
వేధనలే నిన్ను చుట్టి వేసినా ॥2॥
స్నేహితులే తోసి వేసినా
బంధువులే వదిలి వేసినా ॥2॥
॥యేసుండగా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com