ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
arambinchedha yesu neelo prathi dhinam
ఆరంభించెద యేసు నీలో ప్రతీదినంఆనందించెద యేసు నీలో ప్రతీక్షణంఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 1॰నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెద నీ మధుర స్వరంఅరుణోదయమున నీ సహవాసం ॥2॥నింపును నాలో నూతన ధైర్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 2॰నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెద నీ కృపకోసంవేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥ ॥ఆరంభించెద॥ 3॰నా పెదవులతో ప్రతినిమిషం స్తుతియించెద నీ ఘననామందిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥కాల్చును నాలో అహం సర్వం ॥2॥ ॥ఆరంభించెద॥