కనురెప్ప పాటైన కను మూయలేదు
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు ॥2॥
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది ॥2॥
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ॥కనురెప్ప॥
1॰
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది ॥2॥
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని ॥2॥
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ॥కనురెప్ప॥
2॰
ప్రేమ లోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది ॥2॥
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని ॥2॥
పలవరిస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ॥కనురెప్ప॥