తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది
తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది
కాలము సంపుర్ణమౌతున్నాది ॥2॥
కృపకాలమంతమొందక ముందే
క్రిస్తు యేసుని మనసారా వేడుకో ॥2॥
1॰
లెక్కింపబడును నీ దినకార్యములన్నియు
లిఖింపబడును పరలోకమందునా ॥2॥
తప్పింప తరము కాదు ఎవరికి ఇలాలో
తప్పదు మరణించిన తిర్పు పోందుట ॥2॥
2॰
తులతూగును త్రాసులో నీ స్థితి గతులు
తేలికై పోయినచో తప్పదు నరకం ॥2॥
రహస్య పాపాలైన వ్రాయును లెక్కలో
నశింపకుండునట్లు ప్రభుని వేడుమా ॥2॥
3॰
ప్రతివారి తరుపునా ప్రతివాదిగా
క్షమించమని క్రీస్తు తండ్రిని వేడున్ ॥2॥
పరలోక మందు జీవగ్రంధములో
నిపేరు ఉండునట్లు ప్రభుని వేడుమా ॥2॥