neeve na santhosha ganamu నీవే నా సంతోషగానము
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము ॥2॥బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥ 1॰త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి ॥2॥నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ॥2॥ఎదురింతు నీ ప్రేమతో ॥నీవే నా సంతోషగానము॥ 2॰వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ॥2॥ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥ 3॰నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ ॥2॥నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు ॥2॥ ॥నీవే నా సంతోషగానము॥