• waytochurch.com logo
Song # 5808

letha mokkala thandri sannidhilo లేత మొక్కలా తండ్రి సన్నిధిలో


లేత మొక్కలా తండ్రి సన్నిధిలో
నిత్య మహిమలో ఎదిగావు
లోక పాపములే నీ బుజముపై
కల్వరి సిలువలో ఒదిగావు
1॰
సొగసైననూ లేక సురూపమూ లేక
బలియైతివా నా యేసయ్యా ॥2॥
నీ ప్రేమనే రక్తముగా మార్చితివే
నా కొరకే యేసయ్యా ॥2॥
2॰
మృత్యుంజయుడా పునరుద్ధానుడవై
ఆఖరి శత్రువునే గెలిచావు ॥2॥
పరలోక రాజ్యంలా ఈ భువినంతటిని
నీ మహిమతో నింపావు ॥2॥
3॰
సమాధి సంకెళ్ళయినా మరణపు మళ్ళైన జయించితివా నా యేసయ్యా ॥2॥
నీ ఆత్మతో నను ముద్రించితివే
నీ రాజ్యముకే యేసయ్యా ॥2॥

యేసయ్యా యేసయ్యా యేసయ్యా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com