• waytochurch.com logo
Song # 5810

neellala poyabadinanu teegala sagipoyanu నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను


నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను
దుమ్ములా ధూళిలా ప్రాణం పోవునంతలా
తనువులోను మనసులోనూ
శత్రు మిత్రుల చేతుల్లోను
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥నీళ్ళలా॥
1॰
పోయిందని అనుకున్న ప్రాణం తిరిగి దక్కేలా
దక్కిన ప్రాణం క్రొత్త బతుకును ప్రారంభించేలా
దేవునికి మానవునికి ఉపకరించేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥నీళ్ళలా॥
2॰
లోకులు చూపె ప్రేమలోని స్వార్ధం ఎరిగేలా
క్రీస్తులోని నిస్వార్ధ ప్రేమకు అర్ధం తెలిసేలా
అదృశ్యమైనవి నిత్యములంటు గ్రహింపు పొందేలా
నలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥
॥ నీళ్ళలా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com