కన్నీరు విడిచే ఓ సోదరా
kanneeru vidiche o sodhara
కన్నీరు విడిచే ఓ సోదరా కళ్ళు విప్పి చూడు నీ ముందరానీ ముందు నిలిచెను నజరేయుడు చూడు నీ ముందు నిలిచెను ప్రియ యేసుడుకళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో ॥2॥ కన్నీరు॥ 1॰ఒంటరి వానిగ చేసారా నీ ఆకలి ఎగతాళి చేసారాలేని మాటలెన్నో చెప్పారా నీ హృదయమంతా గాయం చేసారా నీ తోడు ఉండువాడు విడువని వాడు నీ తోడు ఉండువాడు మరువని వాడు ॥2॥కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో ॥2॥ ॥కన్నీరు॥ 2॰దైవమే లేదని తలచు చుంటివా దేవుని మేళ్ళను మరచి యుంటివా ఏమి చేయనీకు తోచకున్నదా ॥2॥దిగులుగా దినములు గడుపు చుంటివా ఆయన ఎదపై హాయిగా నిదురపో ॥2॥ఆయన కృపయే నీకు బలం ఆయన శక్తి నిన్ను కమ్ముకొనున్కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో కళ్ళు ॥2॥ ॥కన్నీరు॥