janminchenu sree yesudu జన్మించెను శ్రీ యేసుడు
జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము జగమంతట ఉదయించెను ॥2॥ఆ విభుని సేవింతుము 1॰పరలోక సైన్యమంతా ప్రణుతించె ఆ యేసుని ॥2॥సమాధానమును తెలిపిరి స్తోత్రము చెల్లించిరి ॥2॥జన్మించెను॥ 2॰ఆరాధించగ వచ్చిరి తూర్పునుండి జ్ఞానులు ॥2॥సంతసించి గొల్లలు పూజించను వచ్చిరి ॥2॥జన్మించెను॥ 3॰పాపాలు తొలగించను పరలోకమును వీడెను ॥2॥నమ్మిన ప్రతివారికీ కలుగును మోక్షము ॥2॥జన్మించెను॥