prakatinchara prabhu yesu varthanu ప్రకటించరా ప్రభుయేసు వార్తను
ప్రకటించరా ప్రభుయేసు వార్తను ప్రవచించరా ప్రభుక్రీస్తు రాకను ॥2॥పరలోక రాజ్యము పరవశించు రాజ్యమనీ పరిశుధ్ధులు పాలించు ప్రభుయేసుని రాజ్యమని ॥2॥ ॥ప్రకటించరా॥ 1॰రాయలసీమ రతనాలసీమ కాగ పల్నాటిసీమ పగడాలనిధిగ మార ॥2॥కోనసీమ తన కంబురాశి కాగ ॥2॥దివిసీమ యేసుని హృదయ సీమ కాగ ॥2॥ ॥ప్రకటించరా॥ 2॰జల్లీసీమ జీవజలమయము కాగ పట్టీసీమ పరలోక మహిమసీమ కాగ ॥2॥రెడ్డిసీమ రారాజు పీఠము కాగ ॥2॥ఈశాన్య ఆంధ్రము యేసయ్యది కాగ ॥2॥ ॥ప్రకటించరా॥ 3॰తెలంగాణా పులకరించి పుష్పించను కోయ బంజారా క్రీస్తేసుచెంతచేర ॥2॥హైదరా సికింద్రబాదు హోసన్నని పాడ ॥2॥పట్టణా పల్లెల్లో ప్రేమానందమునిండ ॥2॥ ॥ప్రకటించరా॥ 4॰తెలుగుజాతీ తేజోమయమైనిండ జయగీతమెత్తి జైజై అని పాడ ॥2॥మారును మన ఆంధ్రావని స్వర్ణాంధ్రగా ॥2॥చేరు క్రీస్తు మకుఠమందు మణిపూసగా ॥2॥ ॥ప్రకటించరా॥