nanu srujienchina aadhevudu yekkada vunnado నన్ను సృజియించిన ఆదేవుడు
నన్ను సృజియించిన ఆదేవుడు
ఎక్కడఉన్నాడో
అని ఊరూ వాడా చెట్టూపుట్టా అన్నీ
వెదికాను ॥2॥
సృష్టినే దేవుడని నేను పూజించాను
సృష్టికర్తను మరచీ నేనెంతో వగచాను
॥నను॥
1॰
వెదకిన దేవుడు దొరకగపోగా
నేనే దేవుడని సరిపెట్టుకున్నాను ॥2॥
రక్తము కార్చిన వాడె దేవుడని ॥2॥
తెలిసిన క్షణమున సిలువను చేరితిని ॥2॥
॥నను॥
2॰
మత ఛట్రములో దేవుని బంధించి
విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి ॥2॥
నిజరక్షకునీ అంగీకరించక ॥2॥
నిష్ఠగ నరకాన చేరుట న్యాయమా ॥2॥
నను సృజియించిన ఆదేవుడు
యేసులో ఉన్నాడు
అని ఊరు వాడ పల్లే వెళ్ళీ ॥2॥
తిరిగీ చెబుతాను