bala yesuku jolalu paada బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ
బాల యేసుకు జోలలు పాడ ఈ వేళ – పరలోక సైన్యముల్ పాటలు పాడెన్ ఆ వేళ హద్దు దప్పినా లోకములోన ఆ వేళ – జన్మించె శాంతి ప్రియుడై ప్రేమమయుడై నీతికి స్థాపకుడై ||బాల|| 1.కన్య మేరి ధన్య చరిత్రుండా వేళ – మన పాపరాశికి పావనరక్షా ఈ వేళ అవతరించె పరిహార మొనర్చన్ ఆ వేళ – మన జీవిత లోపాలు దురంతాలు ఘోరమౌ పాపాలు ||బాల||2.పశులశాలలో శిశువై వెలసెన్ ఆ వేళ – సువిశాల లోకపు శోకము మాపెన్ ఈ వేళ చిన్ని బాలలానంద వినోదం ఈ వేళ – చిరునవ్వులు వికసించె ప్రకాశించె ప్రీతియై పరికించె ||బాల||3.హృదయసీమ పదిలంబాయె ఈ వేళ – మదిలోని మమతలె మారణమాయె ఈ వేళ తార వెలసెనోయ్ దారి జూపనోయ్ ఆ వేళ – ఆ చల్లని మార్గంబు సరాళంబు పాపికి తరుణంబు ||బాల||