sri yesu putte jagamandu శ్రీ యేసు పుట్టె జగమందు సమస్త పాపులకు విందు
శ్రీ యేసు పుట్టె జగమందు - సమస్త పాపులకు విందు సాతాను శక్తులిక బందు - ఈ భాగ్యమెరుగ రిలముందు ||శ్రీ యేసు || 1. బీదల కష్టము గాంచి - సదా తా సౌఖ్యమునుడించి పశుల తొట్టి మదినెంచి - శ్రీ మేరి సుతుడుగా నెంచి ||శ్రీ యేసు || 2. భక్తాళి నెల్ల బోషింప - ప్రశస్త కాంతి వెలిగింప బ్రేమాది సుగుణముల నింప - సిలువపై మరణింప ||శ్రీ యేసు || 3. వేదామృతంబు చవినిల - సుఖంబు మదికినిడు చాల చూపింప నేగె నీలీల - నరావతారుడై యిల ||శ్రీ యేసు || 4. ఆనందమూర్తి మదివేడ - సమస్త దుఃఖమును వీడ యత్యానందంబునం -బాడ- శ్రీ మేరి భాగ్యమనియాడ ||శ్రీ యేసు || 5. మోక్షంపు దారి జూపింప - రక్షణవార్త వినిపింప యక్షయ జయములను బాపి - రక్షణసేవ ధరనింప ||శ్రీ యేసు ||