• waytochurch.com logo
Song # 5846

ghanadeva putrudagu ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్


ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్-2
జనులారా స్తోత్రించి ముద్దులాడుడి -2

1. పాడుడి మళ్ళి పాడుడీ -2  పాపుల విమోచకుడు 
    ప్రభు యేసు రక్షకుడు -2  నేడుద్భవించెను బెత్లెహేమున -2            || ఘన ||  

2. తట్టుడి కేలు తట్టుడీ -2  తండ్రియగు దేవుడిచ్చె 
    తన యొక్క ముద్దు పాపన్ -2  నిట్టూర్పులింకేల పాపలోకమా -2     || ఘన || 

3. చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ -2  తొట్టిలోన బట్టతోను 
    చుట్టబడ్డ యేసు పట్టిన్ -2  గట్టిగాను పాదసేవ జేయుడి -2              || ఘన ||

4. దేవుడే తానైననూ -2  దాస్యంపు రూపమును దాల్చుకొన్న 
    యేసునాధున్ -2  విశ్వాస ప్రేమతోను బట్టుమా -2                         || ఘన ||

5. హీనమైన దాసుడా! -2  మానవుని ఘనపర్చ దీనుడాయె 
    ఘన యేసు -2  ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు -2                     || ఘన ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com