ghanadeva putrudagu ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్
ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్-2జనులారా స్తోత్రించి ముద్దులాడుడి -21. పాడుడి మళ్ళి పాడుడీ -2 పాపుల విమోచకుడు ప్రభు యేసు రక్షకుడు -2 నేడుద్భవించెను బెత్లెహేమున -2 || ఘన || 2. తట్టుడి కేలు తట్టుడీ -2 తండ్రియగు దేవుడిచ్చె తన యొక్క ముద్దు పాపన్ -2 నిట్టూర్పులింకేల పాపలోకమా -2 || ఘన || 3. చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ -2 తొట్టిలోన బట్టతోను చుట్టబడ్డ యేసు పట్టిన్ -2 గట్టిగాను పాదసేవ జేయుడి -2 || ఘన ||4. దేవుడే తానైననూ -2 దాస్యంపు రూపమును దాల్చుకొన్న యేసునాధున్ -2 విశ్వాస ప్రేమతోను బట్టుమా -2 || ఘన ||5. హీనమైన దాసుడా! -2 మానవుని ఘనపర్చ దీనుడాయె ఘన యేసు -2 ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు -2 || ఘన ||