vedhakudi vedhakudi yehovaanu వెదకుడి వెదకుడి యెహోవాను వెదకుడి
వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి సమయముండగనే – ఆయనను వెదకుడి కృపకాలముననే ఆయనను వెదకుడి (2) "వెదకు"1. ఆయన మీకు - దొరుకు కాలమున నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా నీపై జాలితో - నిన్ను క్షమియించును -2 తరుణము పోయినా- మరల రాదు -2 "వెదకు"2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును -2 తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"3. బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి మగ్ధలేని మరియ - యేసుని వెదికెను కన్నీటితో హన్నా - దేవుని వెదికెను -2 తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే ఎస్తేరు వెదకి - తన వారిన్ రక్షించే దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు -2 తరుణము పోయినా - మరల రాదు "వెదకు"