• waytochurch.com logo
Song # 5880

saswethaa prematho nannu preminchavaiah శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా


శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృపచేతనే నన్ను రక్షించావయ్యా (2)
నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది నీ దయా గొప్పది "2"

1. అనాదనైన నన్ను వెదకి వచ్చితివి
ప్రేమచూపి కౌగిలించి కాచి యుంటివి

2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి

3. తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి

4. నడిపించిన మార్గమంతా యోచించగా
కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com