• waytochurch.com logo
Song # 5881

shubhavella nee momunu chuusi శుభవేళలో నీ మోమును చూసి అర్పించెదను నన్నూ


శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా "శుభవేళలో"
ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన
నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే

1. ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి -2
నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి "శుభవేళలో"

2. నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి - 2
జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి "శుభవేళలో"

3. శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి - 2
నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి "శుభవేళలో"


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com