• waytochurch.com logo
Song # 5889

yesu andhariki prabhuvu యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు


యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు
లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే "యేసు"

1. అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు"

2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె
పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె "యేసు"

3. పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా
క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు"

4. రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే
నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com