• waytochurch.com logo
Song # 5890

yesu neenu nannu premisthunnavu యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు నీదు ప్రేమను నేను పొందుచున్నాను


యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను
దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది - 2
నీ కృప విస్తరించు చున్నది.

1. ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే -2
అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు
నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు - 2 "దినదినము"

2. నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే - 2
అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు
అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు - 2 " దినదినము"

3. కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే
ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే - 2
అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు
నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు - 2 "దినదినము"


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com