yesaiah naa hrudhayabilaasha neeve naiah యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2
1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2
పూజ్యనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నాకనుల మెదలుచున్న వాడా "యేసయ్యా"
2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2
విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా"