• waytochurch.com logo
Song # 5896

రాలి పోదువో నీవు కూలిపోదువో


రాలి పోదువో నీవు కూలిపోదువో
తెలియదురా నీకు ఏగడియో
పువ్వు రాలు విదముగారాలి పోదువో
అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా "రాలిపో"

1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా
ఒట్టిదిరా నీవు మట్టివిరా (2)
అయ్యో మానవా మాయరా ఇది మాయరా "రాలిపో"

2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా
కుండవురా నీవు పగిలెదవు (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"

3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట
ఎందరు వున్న ఒక్కడివే (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"

4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా
మర్చిపోదురు నిన్ను ఒక దినము (2)
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com